News October 10, 2025

పటాన్‌‌చెరు LIGలో పేలుడు

image

పటాన్‌చెరులోని రామచంద్రపురంలోని LIGలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఇందులో గ్యాస్ లీక్ కాగా కట్టడి చేసేందుకు ప్రయత్నించిన సమయంలో పేడులు జరిగింది. ఈ ఘటనలో అనంత్ స్వరూప్(22) అనే మృతి చెందినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News October 10, 2025

ఐటీ క్యాపిటల్‌గా విశాఖ.. పెట్టుబడుల వెల్లువ

image

దిగ్గజ టెక్ సంస్థల నుంచి వైజాగ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ అనుబంధ Raiden Infotech ₹87,520cr ఇన్వెస్ట్ చేయనుంది. ఇది దేశంలోనే హయ్యెస్ట్ FDI. దీనితోపాటు TCS, సిఫీ కూడా తమ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. అదానీ సంస్థ టెక్ పార్క్ (₹21,844 కోట్లు), మెటా అండర్‌సీ ప్రాజెక్టులు రానున్నాయి. ఈ టెక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో డిజిటల్ ఇన్‌ఫ్రా మెరుగవ్వడంతోపాటు యువతకు వేలాది జాబ్స్ దక్కనున్నాయి.

News October 10, 2025

కామారెడ్డి నుంచి భద్రాచలానికి ఆర్టీసీ బస్సు

image

కామారెడ్డి ఆర్టీసీ డిపో ద్వారా రేపటి నుంచి భద్రాచలం వరకు డీలక్స్ బస్సును ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News October 10, 2025

తూ.గో జిల్లాలో ‘నూరు శాతం ఈ క్రాప్ పూర్తి’

image

తూ.గో జిల్లాలో వరి పంటకు నూరు శాతం ఈ క్రాప్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయన్నారు. రాజమండ్రి రూరల్ 16 , కొవ్వూరు 96, నల్లజర్ల 50, నిడదవోలు 20, గోపాలపురం 10, దేవరపల్లి 35, చాగల్లులో 25 ఎకరాల్లో వరి కోతలు పూర్తి చేశారన్నారు.