News October 10, 2025

TODAY HEADLINES

image

✒ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్
✒ BC రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే
✒ BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: TPCC చీఫ్
✒ APలో రేపటి నుంచి NTR వైద్య సేవలు బంద్: నెట్‌వర్క్ ఆస్పత్రులు
✒ NOVలో టెట్, JANలో DSC నోటిఫికేషన్: మంత్రి లోకేశ్
✒ మోదీతో భేటీ.. వికసిత్ భారత్ జర్నీలో భాగం అవుతామన్న బ్రిటన్ PM స్టార్మర్
✒ WWCలో భారత్‌పై సౌతాఫ్రికా విజయం

Similar News

News October 10, 2025

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

సౌత్ ఇండియన్ బ్యాంక్‌ జూనియర్ ఆఫీసర్/ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. ఢిల్లీ NCR, మహారాష్ట్రలో ఉద్యోగాలున్నాయి. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruit.southindianbank.bank.in/

News October 10, 2025

‘పాడిపంట, భక్తి, జాబ్స్, వసుధ’.. ఇక ప్రతిరోజూ

image

Way2News యునిక్ ఫీచర్లలో ఒకటైన మ్యాగజైన్‌కు విశేష ఆదరణ ఉంది. పాడిపంట, జాబ్స్, భక్తి, వసుధ.. ఇలా వారంలో రోజూ ఒక్కో థీమ్‌తో అందించే కంటెంట్‌ను ప్రతిరోజూ ఇవ్వాలని కొత్తగా కేటగిరీలు తీసుకొచ్చాము. దీంతో మీరు మెచ్చిన కంటెంట్‌ను ప్రతిరోజూ చదువుకోవచ్చు. యాప్‌లో కింద భాగంలో కేటగిరీలు అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి విస్తృతమైన కంటెంట్‌ను పొందండి. కేటగిరీలు కనిపించలేదంటే <>యాప్ అప్డేట్<<>> చేసుకోండి.

News October 10, 2025

మరియాకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌కు నిరాశ

image

2025కి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించింది. డెమొక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వెనిజులాను ఆమె డిక్టేటర్‌‌షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. అటు ఈ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నిరాశే మిగిలింది.