News October 10, 2025

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రస్థాయిలో జిల్లాను అభివృద్ధిలో మొదటి 5 స్థానాల్లో ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. గురువారం తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. సివిల్ సప్లైస్ ద్వారా స్మార్ట్ రైస్ కార్డులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News October 10, 2025

ఏ ఒక్క పత్తి రైతూ నష్టపోకుండా చూడాలి: VZM జేసీ

image

ఏ ఒక్క పత్తి రైతు నష్టపోకుండా చూడాలని అధికారుల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాద‌వ‌న్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ ఛాంబర్‌లో శుక్రవారం జరిగింది. పత్తి రైతు ఈ-క్రాప్ కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప‌త్తికి మద్దతు ధర క్వింటా రూ. 8,110గా నిర్ణ‌యించింద‌ని, ఈ విష‌యాన్ని RSKల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

News October 10, 2025

VZM: ‘సూపర్ జీఎస్టీతో అన్నివ‌ర్గాల‌కు ప్ర‌యోజ‌న‌క‌రం’

image

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌ల్గించే విధంగా జీఎస్టీ శ్లాబుల‌ను ప్ర‌భుత్వం స‌వ‌రించింద‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి చెప్పారు. దీనిని ప్ర‌జ‌లంతా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. స్థానిక మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత‌, నృత్య క‌ళాశాల‌లో వాణిజ్య ప‌న్నుల‌శాఖ‌, ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల‌ ప్ర‌ద‌ర్శ‌న, విక్రయాల‌ను శుక్ర‌వారం ప్రారంభించారు.

News October 10, 2025

విజయనగరం: GST.. రేట్లు తగ్గలే..!

image

కేంద్ర ప్రభుత్వం GST తగ్గించి నేటికి 18 రోజులైనా పాతధరలకే అమ్మకాలు సాగిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ప్రధానంగా స్టేషనరీ వస్తువులైన నోటుబుక్స్, ఎక్సర్‌సైజ్, గ్రాఫ్ బుక్స్, లాబొరేటరీ నోటుబుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, క్రేయాన్స్ తదితర వస్తువులను 12% నుంచి 0% చేసినా కొన్నిచోట్లు పాత ధరలతోనే అమ్ముతున్నారు. దీంతో పేద విద్యార్థులకు GST ప్రయోజనం చేకూరడం లేదు. మీ ప్రాంతంలో GST తగ్గిందా? కామెంట్ చేయండి.