News October 10, 2025
హనుమకొండ: ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్‌షిప్ మేళా

ఈ నెల 13న హనుమకొండ ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జి.సక్రు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు apprenticeshipindia.gov.in/mela-registrationలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువపత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు. ఐటీఐ పాసై 28 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News October 10, 2025
‘పాడిపంట, భక్తి, జాబ్స్, వసుధ’.. ఇక ప్రతిరోజూ

Way2News యునిక్ ఫీచర్లలో ఒకటైన మ్యాగజైన్‌కు విశేష ఆదరణ ఉంది. పాడిపంట, జాబ్స్, భక్తి, వసుధ.. ఇలా వారంలో రోజూ ఒక్కో థీమ్‌తో అందించే కంటెంట్‌ను ప్రతిరోజూ ఇవ్వాలని కొత్తగా కేటగిరీలు తీసుకొచ్చాము. దీంతో మీరు మెచ్చిన కంటెంట్‌ను ప్రతిరోజూ చదువుకోవచ్చు. యాప్‌లో కింద భాగంలో కేటగిరీలు అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి విస్తృతమైన కంటెంట్‌ను పొందండి. కేటగిరీలు కనిపించలేదంటే <
News October 10, 2025
సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలి: కలెక్టర్

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీలో నిర్వహించిన “సమాచార హక్కు చట్టం – 2005” వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలన్నారు.
News October 10, 2025
రేపు ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన ప్రారంభం: కలెక్టర్

ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన (PMDDKY) శనివారం ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. దేశవ్యాప్తంగా 100 వెనుకబడిన వ్యవసాయ జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం రూపొందించినట్లు చెప్పారు. ఇందులో జనగామ జిల్లా ఎంపిక కాగా రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన సాగునీరు, సులభంగా రుణాలు అందించడం ద్వారా పేదలు, రైతులు, యువత, మహిళలకు లబ్ధి చేకూరుతుంది.