News April 7, 2024
వచ్చాడు.. వెళ్లాడు

ముంబై ‘మిస్టర్ 360’ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యారు. మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అతడు నోకియా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. ఇక ధనాధన్ ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్ మొదలు పెట్టిన రోహిత్ శర్మ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 49 రన్స్ చేశారు. హిట్‌మ్యాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించిన ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 14, 2026
మకరజ్యోతి వేళ.. శబరిమలలో మరో స్కామ్!

కేరళ శబరిమల ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డులో మరో స్కామ్ బయటపడింది. అయ్యప్ప అభిషేకం కోసం భక్తులు ఆలయం వద్ద కొనే నెయ్యి ప్యాకెట్ల డబ్బు రూ.35 లక్షలు బోర్డుకు చేరలేదు. ఇది గుర్తించిన ప్రభుత్వం కేసును ACBకి అప్పగించింది. ఇప్పటికే 5Kgs బంగారు తాపడాల మిస్సింగ్ స్కామ్ రాజకీయంగానూ దుమారం రేపుతుండగా ఈ ఉదంతంతో ప్రభుత్వం మరింత కార్నర్ కానుంది. అటు ఈ సాయంత్రం పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది.
News January 14, 2026
బంగ్లా ఎన్నికలపై మైనార్టీల్లో భయాందోళనలు

బంగ్లాదేశ్‌లో FEB 12న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల్లో పాల్గొనడంపై మైనార్టీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రైస్తవ బౌద్ధ ఐక్యతా మండలి ప్రతినిధులు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్‌ను కలిశాయి. భద్రతపై ప్రజల ఆందోళనను తెలియజేశాయి. ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరాయి.
News January 14, 2026
గంగిరెద్దుల విన్యాసాలు – పల్లెటూరి సందడి

సంక్రాంతి వేళ పల్లె వాకిళ్లలో గంగిరెద్దుల సందడి ఉంటుంది. చక్కగా అలంకరించిన ఎద్దును ఇంటింటికీ తిప్పుతూ, డోలు సన్నాయి వాయిద్యాల మధ్య విన్యాసాలు చేయిస్తారు. ‘అయ్యగారికి, అమ్మవారికి దండం పెట్టు’ అనగానే ఆ ఎద్దు తల ఊపుతూ అభినయించడం ముచ్చటగా ఉంటుంది. శివుని వాహనమైన నందిగా భావించి, ప్రజలు వీటికి పాత బట్టలు, ధాన్యం దానం చేస్తారు. గంగిరెద్దులు ఇంటికి రావడం లక్ష్మీప్రదమని, పశుసంపద వృద్ధి చెందుతుందని నమ్మకం.


