News October 10, 2025
పోలీస్ పెట్రోలింగ్ గస్తీ ముమ్మరం: ఎస్పీ

కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ప్రజల భద్రత రక్షణలో భాగంగా ప్రధాన రహదారుల్లో పోలీసుల పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. గురువారం కర్నూలులో ప్రధాని సభ వద్ద బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి నేరాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News October 9, 2025
కర్నూలు జిల్లా నూతన జేసీగా నూరుల్

కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నూరుల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నవ్యను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్ పర్సన్‌గా నియమించింది.
News October 8, 2025
నేటి నుంచి ఎస్జీఎఫ్ అండర్-19 క్రీడా పోటీలు

కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నేటి నుంచి ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికల విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, 9న చెస్, క్యారమ్స్, బాస్కెట్‌బాల్, పవర్ లిఫ్టింగ్, బాల్ బ్యాడ్మింటన్, 10న బ్యాడ్మింటన్, బేస్ బాల్, సాఫ్ట్ బాల్, త్రో బాల్, 11న హ్యాండ్ బాల్, హాకీ, రోప్ స్కిప్పింగ్, రోల్ బాల్, 13న క్రికెట్, యోగా ఎంపిక పోటీలు ఉంటాయని ఎస్జీఎఫ్ కార్యదర్శి రాఘవేంద్ర మంగళవారం తెలిపారు.
News October 8, 2025
ప్రధాని పర్యటన నేపథ్యంలో సమన్వయంతో పని చేయాలి: ఎస్పీ

ఈనెల 16 ప్రధాని మోదీ శ్రీశైలం, కర్నూలులో పర్యటిస్తున్నందన ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రత ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. నన్నూరులోని రాగ మయూరి వద్ద బహిరంగ సభ, పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్లు ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండకూడదని పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు. సమన్వయంతో పని చేయాలన్నారు.