News October 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News October 10, 2025
ఉమ్మనీరు పెరగాలంటే ఇలా చేయండి

గర్భంతో ఉన్నప్పుడు తగినంత ఉమ్మనీరు ఉండటం చాలా ముఖ్యం. లేదంటే కడుపులోని బిడ్డ ఎదుగుదలలో ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. దీనికోసం వీలైనంత ఎక్కువగా నీళ్లు, జ్యూసులు తీసుకోవాలి. దోసకాయలు, బ్రకోలీ, పాలకూర, క్యారెట్ వంటి కూరగాయలు, పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అయినా ఉమ్మనీరు పెరగకపోతే డాక్టర్ల సూచన మేరకు తగిన మందులు వాడాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>
News October 10, 2025
నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్.. ఎవరీ మరియా..

వెనిజులాకు చెందిన మరియా కొరినా <<17966688>>మచాడోను<<>> నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలిసిందే. 1967 OCT 7న జన్మించిన మరియా 2002లో రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ప్రతిపక్ష పార్టీ ‘వెంటె వెనెజులా’కు నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. 2018లో BBC 100 ఉమెన్, టైమ్ మ్యాగజైన్ వరల్డ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో నిలిచారు. దేశం దాటి వెళ్లకుండా ఆమెపై వెనిజులా ప్రభుత్వం నిషేధం విధించింది.
News October 10, 2025
నెలసరి సెలవు.. మన దగ్గరా ఉండాలంటూ పోస్టులు!

కర్ణాటక ప్రభుత్వం నెలసరి సమయంలో మహిళలు పడే ఇబ్బందిని గుర్తించి నెలకు ఒకరోజు చొప్పున ఏడాదికి 12 రోజులు పెయిడ్ లీవ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. రుతుక్రమంలో తొలిరోజు లేచి నడిచేందుకూ తాము ఇబ్బంది పడతామని, దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు దీన్ని అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని CMలకు కోరుతున్నారు. మీ కామెంట్?