News October 10, 2025
పాలమూరు: కోర్టు స్టే.. కాంగ్రెస్ MLA కీలక వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టేను చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇందుకు సంబంధించి పార్టీపరమైన స్పష్టత రెండు రోజుల్లో రాబోతోందని కాంగ్రెస్ నేత, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News October 10, 2025
ఉమ్మనీరు పెరగాలంటే ఇలా చేయండి

గర్భంతో ఉన్నప్పుడు తగినంత ఉమ్మనీరు ఉండటం చాలా ముఖ్యం. లేదంటే కడుపులోని బిడ్డ ఎదుగుదలలో ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. దీనికోసం వీలైనంత ఎక్కువగా నీళ్లు, జ్యూసులు తీసుకోవాలి. దోసకాయలు, బ్రకోలీ, పాలకూర, క్యారెట్ వంటి కూరగాయలు, పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అయినా ఉమ్మనీరు పెరగకపోతే డాక్టర్ల సూచన మేరకు తగిన మందులు వాడాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>
News October 10, 2025
తగ్గిన పల్లికాయ, పెరిగిన మొక్కజొన్న ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు శుక్రవారం చిరు ధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మక్కల ధర పెరగగా, పల్లికాయ ధర తగ్గింది. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,130 ధర పలకగా.. ఈరోజు రూ.2,160 చేరింది. సూక పల్లికాయకు గురువారం రూ.6,500 ధర రాగా.. నేడు రూ.5,900కి పడిపోయింది. పచ్చి పల్లికాయకు నిన్న రూ.4,000 ధర పలకగా.. శుక్రవారం రూ.4,100 అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. దీపిక రకం మిర్చికి రూ.14 వేలు వచ్చింది.
News October 10, 2025
నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్.. ఎవరీ మరియా..

వెనిజులాకు చెందిన మరియా కొరినా <<17966688>>మచాడోను<<>> నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలిసిందే. 1967 OCT 7న జన్మించిన మరియా 2002లో రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ప్రతిపక్ష పార్టీ ‘వెంటె వెనెజులా’కు నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. 2018లో BBC 100 ఉమెన్, టైమ్ మ్యాగజైన్ వరల్డ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో నిలిచారు. దేశం దాటి వెళ్లకుండా ఆమెపై వెనిజులా ప్రభుత్వం నిషేధం విధించింది.