News October 10, 2025

కరీంనగర్: రిజర్వేషన్లు సాధించడంలో కాంగ్రెస్ విఫలం: గంగుల

image

బీసీ రిజర్వేషన్లు సాధించడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ నేతలు గంగుల కమలాకర్, సుంకే రవిశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. 42% రిజర్వేషన్‌పై హైకోర్టు స్టే విధించడం కాంగ్రెస్ చేసిన కోర్టు డ్రామా అని ఆరోపించారు. పిటిషనర్ల తరఫున ఫీజు కట్టి, బీసీలను మోసం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ఇచ్చినా రిజర్వేషన్లు సాధించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.

Similar News

News October 10, 2025

HYD: యువతి సూసైడ్.. ఈ యువకుడిపై అనుమానం

image

లాలాపేట PS పరిధి రైల్వే డిగ్రీ కాలేజీ విద్యార్థి మౌనిక(20) సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. MKనగర్‌లో నివాసం ఉండే అంబాజీ(వాలీబాల్ కోచ్) మీద మృతురాలి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల మీద నమ్మకం ఉందని, నిజాలు తేల్చుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. వాలీబాల్ కోచ్‌ వేధింపులే ఆమె సూసైడ్‌కు కారణమని మౌనిక స్నేహితులు చెప్పారు. కోచ్‌కు కాలేజీకి సంబంధం లేదని అక్కడి సిబ్బంది స్పష్టం చేశారు.

News October 10, 2025

రూ.755 ప్రీమియంతో రూ.15లక్షలు బీమా!

image

ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. అందుకే ఇన్సూరెన్స్ తీసుకుంటే కుటుంబ పెద్దకు ఏమైనా జరిగితే వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది. పోస్టాఫీసులో ఏడాదికి రూ.755 ప్రీమియంతో రూ.15 లక్షలు, రూ.399తో రూ.10లక్షల వరకు ప్రమాద <>బీమా<<>> పొందవచ్చు. బీమాదారుడు చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా నామినీకి ఈ నగదును అందిస్తారు. ఆస్పత్రిపాలైతే ఖర్చులకూ కొంత డబ్బును అందిస్తారు. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

News October 10, 2025

HYD: బాణసంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి: సీపీ

image

దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. బాణసంచా దుకాణాలకు పోలీసు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు ఫారానికి డివిజనల్ ఫైర్ ఆఫీసర్ నుంచి పొందిన ఎన్ఓసీ పత్రాన్ని జతపరిచాలని, ప్రైవేట్ భూమి అయితే యజమాని నుంచి ఎన్ఓసీ పత్రాన్ని జతపరచాలన్నారు.