News October 10, 2025
MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడిగింపు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 13లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 23లోపు (ఫైన్‌తో) అప్లె చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT.
Similar News
News October 10, 2025
బాలికలకు స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేసుకోండి

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో సంస్థ సంతూర్ ఉమెన్ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రభుత్వ కళాశాలల్లో చదివిన బాలికలు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫస్టియర్ చదువుతూ ఉండాలి. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబరు 15. ఎంపికైనవారికి రూ.30వేలు అందుతుంది.
వెబ్‌సైట్: <
News October 10, 2025
ఖైరతాబాద్ పీసీసీ అబ్జర్వర్‌గా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుల నియామక కసరత్తు వేగవంతమైంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి వివిధ జిల్లాలకు పీసీసీ అబ్జర్వర్లను నియమించారు. ఇందులో భాగంగా, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఖైరతాబాద్ జిల్లా పీసీసీ అబ్జర్వర్‌గా నియమించారు.ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.
News October 10, 2025
3,500 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

కెనరా బ్యాంకులో 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి OCT 12 చివరితేదీ. APలో 242, TGలో 132 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాసైన 20-28ఏళ్ల వయస్కులు అర్హులు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.15వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వెబ్‌సైట్: www.canarabank.bank.in
* ప్రతి రోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.