News October 10, 2025
సిద్దిపేట: బీసీ రిజర్వేషన్లపై స్టే.. అంతా సైలెంట్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు కలిపి బీసీలకు 225 దక్కగా, తాజా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 327కు పెరిగింది. కోర్టు స్టే కారణంగా పెరిగిన ఈ స్థానాల భవితవ్యంపై అయోమయం నెలకొంది.
Similar News
News October 10, 2025
విశాఖ: GST.. రేట్లు తగ్గలే..!

కేంద్రం తగ్గించిన GST రేట్లపై అధికారులు, నాయకులు విస్తృతంగా అవగాహన చేపడుతున్నా.. వ్యాపారులు పాత ధరలకే అమ్మకాలు సాగిస్తున్నట్లు ఉమ్మడి విశాఖలో ఆరోపణలొస్తున్నాయి. ప్రధానంగా నోటుబుక్స్, గ్రాఫ్ బుక్స్, లాబొరేటరీ తదితర వస్తువులపై పన్ను జీరో శాతం చేసినా పాత ధరలతోనే అమ్ముతున్నారంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు పన్ను తగ్గింపు ఫలాలు అందడం లేదు. మరి మీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉందా? కామెంట్.
News October 10, 2025
ఏ దేవుడికి ఏ నూనెతో దీపం వెలిగించాలి?

ఇష్టదైవాన్ని ఆరాధించేటప్పుడు శ్రేయస్సు, ప్రతిష్ఠల కోసం ఆముదం నూనెతో దీపం వెలిగించాలి.
ఆంజనేయుడి కటాక్షం పొందడానికి మల్లెపూల నూనెతో దీపారాధన చేయాలి.
శత్రువుల నుంచి రక్షణ పొందడానికి కాలభైరవుడి ఆలయంలో ఆవనూనెతో దీపం వెలిగించాలి.
ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆవాల నూనెతో దీపారాధన చేయాలి.
రాహు, కేతు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తొలగిపోవడానికి, మునగ నూనెతో దీపం వెలిగించాలి.
News October 10, 2025
పార్వతీపురం: GST.. రేట్లు తగ్గలే..!

కేంద్రం తగ్గించిన GST రేట్లపై అధికారులు, నాయకులు విస్తృతంగా అవగాహన చేపడుతున్నా.. వ్యాపారులు పాత ధరలకే అమ్మకాలు సాగిస్తున్నట్లు పార్వతీపురం జిల్లాలో ఆరోపణలొస్తున్నాయి. ప్రధానంగా నోటుబుక్స్, గ్రాఫ్ బుక్స్, లాబొరేటరీ తదితర వస్తువులపై పన్ను జీరో శాతం చేసినా పాత ధరలతోనే అమ్ముతున్నారంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు పన్ను తగ్గింపు ఫలాలు అందడం లేదు. మరి మీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉందా? కామెంట్.