News October 10, 2025
రూ.10,896 కోట్లతో హ్యామ్ రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి

TG: వచ్చే మూడేళ్లలో రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో రూ.10,896 కోట్లతో 5,587kms మేర హ్యామ్ రోడ్లను వేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్, జిల్లా కేంద్రాల నుంచి HYDకు 4 లేన్ రోడ్లు వేస్తామని, యాక్సిడెంట్ ఫ్రీ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టామని చెప్పారు.
Similar News
News October 10, 2025
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియెట్-2025 పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగుస్తుండటంతో ఈనెల 22 వరకు దాన్ని బోర్డు పొడిగించింది. జనరల్, వొకేషనల్ కోర్సులు చదివే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ప్రయివేటు అభ్యర్థులు గడువులోగా ఫీజు చెల్లించాలని సూచించింది. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇదే చివరి ఛాన్సు అని మరోసారి పొడిగింపు ఉండదని ఇంటర్ బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా స్పష్టం చేశారు.
News October 10, 2025
2047నాటికి నంబర్ వన్‌గా AP: చంద్రబాబు

AP: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విశ్వసముద్ర గ్రూప్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘రామాయపట్నంలో త్వరలో BPCL పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది. 2047నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పటికి దేశంలోనే AP నంబర్ వన్‌గా అవతరిస్తుంది’ అని తెలిపారు.
News October 10, 2025
వంటింటి చిట్కాలు

* దొండకాయలు తరిగేటప్పుడు చేతులకు కొద్దిగా నిమ్మరసం రాసుకుంటే వాటి జిగురు చేతులకు అంటుకోకుండా ఉంటుంది.
* అరటికాయలు కోసిన తరువాత నల్లబడకుండా ఉండాలంటే వాటిని వేసే నీళ్ళలో నాలుగు చుక్కల వెనిగర్ కలపాలి.
* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగులు చేరవు.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యప్పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి. <<-se>>#VantintiChitkalu<<>>