News October 10, 2025
నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం (M) ఈదగాలిలో నందగోకులం లైఫ్ స్కూలును ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి స్టూడెంట్స్‌తో ముచ్చటిస్తారు. ఆ తర్వాత సమీపంలోని గోశాలకు వెళ్లి నంది పవర్ ట్రెడ్ మిల్, నందగోకులం సేవ్ ది బుల్ ప్రాజెక్టులతో పాటు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.
Similar News
News October 10, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

AP: ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శుక్రవారం అత్యధికంగా కోనసీమ(D) నగరంలో 46MM, మలికిపురంలో 36.2MM వర్షపాతం నమోదైందని తెలిపింది.
News October 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 31 సమాధానాలు

1. విశ్వామిత్రుని ఆశ్రమం ‘సిద్ధారామం’.
2. బర్బరీకుడి తండ్రి ‘ఘటోత్కచుడు’.
3. పోతన తన ‘ఆంధ్ర మహాభాగవతం’ గ్రంథాన్ని శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు.
4. కామ దేవుని వాహనం ‘చిలుక’.
5. సంస్కృతంలో కూడా లక్షను లక్ష అనే అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 10, 2025
మొదటి ద్వారం నుంచే శ్రీవారిని చూసే అవకాశం

శ్రీవారి దివ్య రూపాన్ని బంగారు వాకిలి(మొదటి గడప) నుంచి వీక్షించే భాగ్యాన్ని TTD కల్పిస్తోంది. సాధారణ దర్శనం ఏడో ద్వారం నుంచి జరుగుతుంది. సుప్రభాత, తోమాల వంటి సేవలను అతి చేరువ(10ft) నుంచి చూసి తరించవచ్చు. ఈ అవకాశం లక్కీ డిప్ ద్వారా ఎంపికైనవారికి లభిస్తుంది. ప్రతి నెలా 18వ తేదీన ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
* ప్రతిరోజూ ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.