News October 10, 2025
ఈ నెలలో ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ!

AP: ఈ నెల 16 లేదా 17న దేశం నుంచి నైరుతి రుతుపవనాలు ఎగ్జిట్ అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు సౌత్ ఇండియాలోకి ఎంటర్ అవుతాయని పేర్కొంది. వీటి ప్రభావంతో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. నేడు అల్లూరితో పాటు రాయలసీమలో పిడుగులతో భారీ వానలు పడతాయని APSDMA వెల్లడించింది.
Similar News
News October 10, 2025
రాష్ట్ర ఆయుష్ శాఖకు రూ.166 కోట్లు విడుదల: మంత్రి సత్యకుమార్

AP: రాష్ట్రంలో కొత్తగా ఆయుష్ శాఖకు చెందిన 5 ఆస్పత్రులు, 3 కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్ర ఆయుష్ శాఖ అభివృద్ధికి కేంద్రం రూ.166 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. ధర్మవరం, కాకినాడకు కొత్తగా ఆయుర్వేద కాలేజీలు మంజూరు చేసినట్లు వివరించారు. ఆయుష్ వ్యవస్థని మరింత పటిష్ఠ పరిచేలా బోధనా, బోధనేతర సిబ్బంది కోసం 500 పోస్టుల నియామకాలు చేపట్టబోతున్నామని ఆయన పేర్కొన్నారు.
News October 10, 2025
ట్రంప్‌కు ‘నో’బెల్.. పాక్ గొంతులో వెలక్కాయ!

పాక్‌కు ప్రతిచోటా భంగపాటే ఎదురవుతోంది. Op సిందూర్‌తో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నారు. SMలో ఫేక్ ఫొటోలతో నవ్వులపాలయ్యారు. వైట్‌హౌస్‌కెళ్లిన అసిఫ్ మునీర్, షెహబాజ్ షరీఫ్ ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఫొటోలకు పోజులిచ్చి డాంబికాలకు పోయారు. శాంతిదూతంటూ నోబెల్‌కు సిఫార్సు చేశారు. తీరాచూస్తే నార్వే కమిటీ వారినసలు పట్టించుకోనే లేదని తెలియడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టైందని SMలో నెటిజన్లు నవ్వేస్తున్నారు.
News October 10, 2025
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

AP నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్ట్ అయ్యారు. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఆయనను గన్నవరంలో అదుపులోకి తీసుకున్నారు. 23 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొనగా జనార్దన్ రావును ఏ-1గా చేర్చారు. కొద్దిరోజుల క్రితం ములకలచెరువులో నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. జనార్దన్ రావు తన అనుచరులతో కలిసి కల్తీ మద్యం తయారుచేసి, ప్రభుత్వ వైన్స్‌లకు సరఫరా చేసినట్లు తేల్చారు.