News April 7, 2024
పాసెంజర్‌కు ఎయిర్ ఇండియా క్షమాపణలు

విమానంలో విరిగిపోయిన కుర్చీని కేటాయించారంటూ ఓ పాసెంజర్ ఎయిర్ ఇండియా సంస్థపై ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించానని, విండో సీటు కోసం రూ.1000 అదనంగా చెల్లించానని సదరు వ్యక్తి తెలిపారు. అయినప్పటికీ తనకు విరిగిన కుర్చీని కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పోస్టుకు స్పందించిన ఎయిర్ ఇండియా సారీ చెప్పింది. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Similar News
News January 11, 2026
PSLV-C62 కౌంట్‌డౌన్ స్టార్ట్

AP: తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్‌లో PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు ఉ.10.18 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది PSLVకి 64వ ప్రయోగం కాగా PSLV-DL వేరియంట్‌లో 5వ మిషన్. ఈ వాహక నౌక 44.4 మీటర్ల ఎత్తు, 260 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.
News January 11, 2026
పసిపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

శీతాకాలంలో పసిపిల్లలు ఎక్కువగా జలుబుకు గురవుతారు. అయితే ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించడం సులువవుతుందంటున్నారు నిపుణులు. శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు/ నీలం రంగులో కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. అలాగే శ్వాస వేగంగా తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News January 11, 2026
జనసేనతో పొత్తు అవసరం లేదు: రాంచందర్

TG: మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో BJPకి పొత్తు అవసరం లేదని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. APలో పరిణామాల ఆధారంగానే కూటమి ఏర్పాటైందని, ఇక్కడ తాము బలంగా ఉన్నట్లు చెప్పారు. పొత్తు ఉంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అధిష్ఠానానికీ ఇదే విషయం చెబుతామన్నారు. కాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమని JSP నిన్న ప్రకటించింది.


