News October 10, 2025
నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్!

AP: రాష్ట్రంలో నేటి నుంచి NTR వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు నిన్ననే ప్రకటించాయి. రూ.2,700 కోట్లు రావాలని, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాయి. వైద్య సేవలు నిలిపేయొద్దని, సమస్య పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ కోరినప్పటికీ నెట్‌వర్క్ ఆస్పత్రులు వెనక్కి తగ్గలేదు.
Similar News
News October 10, 2025
ADR తప్పుడు అఫిడవిట్లపై సుప్రీం అసంతృప్తి

AP: బిహార్ SIRపై దాఖలైన కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్ సమర్పించిన అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పేర్లు తొలగించారంటూ అఫిడవిట్లో పేర్కొన్నవారు సరైన పత్రాలు అందించలేదని ECI న్యాయవాది ద్వివేది తెలిపారు. ఇలాంటివి మరిన్ని ఉన్నాయని, వెరిఫై సాధ్యం కాదని ప్రశాంత్ భూషణ్ సమర్థించుకోబోయారు. అయితే తమకు సమర్పించే ముందే పరిశీలించాల్సిన బాధ్యత లేదా అని ప్రశాంత్, ADRలను కోర్టు ప్రశ్నించింది.
News October 10, 2025
నోబెల్ పీస్ ప్రైజ్ గెలిస్తే ఎన్ని రూ.కోట్లు ఇస్తారంటే?

నోబెల్ <<17966688>>పీస్ ప్రైజ్<<>> ప్రకటించిన నేపథ్యంలో ఈ బహుమతి గెలిచిన వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారన్న అంశంపై చర్చ మొదలైంది. నోబెల్ శాంతి బహుమతి విజేతకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్(దాదాపు రూ.10.25 కోట్లు) ప్రైజ్ మనీ, పతకం ఇస్తారు. మరోవైపు ట్రంప్‌కు నోబెల్ ఇవ్వకపోవడంపై కమిటీ వివరణ ఇచ్చింది. ఆయన పేరిట వచ్చిన నామినేషన్లు అన్నీ గడువు(జనవరి 31) ముగిశాక వచ్చినవేనని స్పష్టం చేసింది.
News October 10, 2025
IPS పూరన్ కుమార్ ఆత్మహత్యపై SIT

సీనియర్ IPS అధికారి <<17962864>>పూరన్ కుమార్<<>> ఆత్మహత్యపై హరియాణా ప్రభుత్వం ఆరుగురితో సిట్ ఏర్పాటు చేసింది. చండీగఢ్ ఐజీ పుష్పేంద్రకుమార్ దీనికి నేతృత్వం వహిస్తారు. SSP కన్వర్‌దీప్ కౌర్, ఎస్పీ కేఎం ప్రియాంక, డీఎస్పీ చరణ్‌జీత్ సింగ్, గుర్జీత్ కౌర్, జైవీర్ రాణా సభ్యులు. అన్ని కోణాల్లో సత్వర, నిష్పాక్షిక విచారణకు సిట్‌ను ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోగా నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.