News October 10, 2025

IOCLలో 523పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో 523 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులకు అప్లై చేయడానికి రేపే(OCT 11)ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినవారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com/

Similar News

News October 10, 2025

IPS పూరన్ కుమార్ ఆత్మహత్యపై SIT

image

సీనియర్ IPS అధికారి <<17962864>>పూరన్ కుమార్<<>> ఆత్మహత్యపై హరియాణా ప్రభుత్వం ఆరుగురితో సిట్ ఏర్పాటు చేసింది. చండీగఢ్ ఐజీ పుష్పేంద్రకుమార్ దీనికి నేతృత్వం వహిస్తారు. SSP కన్వర్‌దీప్ కౌర్, ఎస్పీ కేఎం ప్రియాంక, డీఎస్పీ చరణ్‌జీత్ సింగ్, గుర్జీత్ కౌర్, జైవీర్ రాణా సభ్యులు. అన్ని కోణాల్లో సత్వర, నిష్పాక్షిక విచారణకు సిట్‌ను ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోగా నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.

News October 10, 2025

సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఇవి చూస్తున్నారా?

image

చర్మాన్ని UV రేస్ నుంచి కాపాడటానికి సన్‌స్క్రీన్ వాడతాం. కానీ కొన్ని ఫార్ములేషన్లు ఆరోగ్యానికి హానికరమంటున్నారు నిపుణులు. కొన్ని సన్‌‌స్ర్కీన్లలో ఉండే ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ అనేవి ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్, క్యాన్సర్‌ కారకాలని అంటున్నారు. అందుకే సన్‌స్క్రీన్ కొనేముందు లేబుల్స్ కచ్చితంగా చెక్ చెయ్యాలి.✍️ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీలోకి వెళ్లండి.

News October 10, 2025

రాష్ట్ర ఆయుష్ శాఖకు రూ.166 కోట్లు విడుదల: మంత్రి సత్యకుమార్

image

AP: రాష్ట్రంలో కొత్తగా ఆయుష్ శాఖకు చెందిన 5 ఆస్పత్రులు, 3 కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్ర ఆయుష్ శాఖ అభివృద్ధికి కేంద్రం రూ.166 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. ధర్మవరం, కాకినాడకు కొత్తగా ఆయుర్వేద కాలేజీలు మంజూరు చేసినట్లు వివరించారు. ఆయుష్ వ్యవస్థని మరింత పటిష్ఠ పరిచేలా బోధనా, బోధనేతర సిబ్బంది కోసం 500 పోస్టుల నియామకాలు చేపట్టబోతున్నామని ఆయన పేర్కొన్నారు.