News October 10, 2025

ఏలూరు: భార్యను కడతేర్చిన భర్త.!

image

అనుమానంతో భార్యను భర్త హతమార్చిన ఘటన గురువారం ఏలూరులో చోటు చేసుకుంది. శనివారపు పేట సమీపంలో నివసిస్తున్న కంతేటి నరేశ్ తాపీ పనులు చేస్తూ భార్య నాగలక్ష్మి (34) మిషన్ కుడుతూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్య వేరొకరితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకొని కక్ష పెంచుకున్నాడు. దీంతో గురువారం కత్తెరతో దాడికి పాల్పడటంతో ఆసుపత్రికి తరలించే లోపు ఆమె మృతి చెందింది. 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 10, 2025

భూ సేకరణ సమస్యలు త్వరితగతన పరిష్కరించాలి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ రెవిన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు.

News October 10, 2025

ADR తప్పుడు అఫిడవిట్లపై సుప్రీం అసంతృప్తి

image

AP: బిహార్‌ SIRపై దాఖలైన కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్ సమర్పించిన అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పేర్లు తొలగించారంటూ అఫిడవిట్లో పేర్కొన్నవారు సరైన పత్రాలు అందించలేదని ECI న్యాయవాది ద్వివేది తెలిపారు. ఇలాంటివి మరిన్ని ఉన్నాయని, వెరిఫై సాధ్యం కాదని ప్రశాంత్ భూషణ్ సమర్థించుకోబోయారు. అయితే తమకు సమర్పించే ముందే పరిశీలించాల్సిన బాధ్యత లేదా అని ప్రశాంత్, ADRలను కోర్టు ప్రశ్నించింది.

News October 10, 2025

సిద్దిపేట: లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులు

image

మావోయిస్టు స్టేట్‌ కమిటీ సభ్యులు ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటి అలియాస్ రమేశ్, తొండెం గంగ అలియాస్ సోనీ, మొగిలిచర్ల చందు అలియాస్ వెంకట్రాజు జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలన్నారు. తెలంగాణకు చెందిన 72 మంది మావోయిస్టులు ఉన్నారని చెప్పారు.