News October 10, 2025
పసికందు మృతి.. బాధ్యులపై కఠిన చర్యలు

అనంతపురంలోని శిశు గృహంలో పసికందు మృతి ఘటనకు బాధ్యులపై కలెక్టర్ ఓ.ఆనంద్ తీవ్ర చర్యలకు ఉపక్రమిస్తున్నారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంపై డీసీపీఓ, మేనేజర్, సోషల్ వర్కర్‌తో పాటు ఐదుగురు ఆయాలకు నోటీసులు జారీ చేశారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు దస్త్రం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో ఐసీడీఎస్ పీడీ నాగమణి సస్పెండ్ కాగా డీసీవో అరుణకుమారి ఇన్‌ఛార్జి పీడీగా నియమితులయ్యారు.
Similar News
News October 10, 2025
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచాలి: కలెక్టర్

అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణులు, పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై శుక్రవారం సమీక్ష నిర్వహించి వారు మాట్లాడారు. సిబ్బంది పనితీరును మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, వైద్యాధికారుల సహకారంతో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.
News October 10, 2025
మేడారం భక్తులకు అందుబాటులో క్యూఆర్ కోడ్

మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు డిజిటల్ తరహాలో కానుకలు చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గద్దెల ప్రాంగణంలో ‘ఈ-కానుక’ పేరుతో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. హుండీలో కానుకలను వేయడంతో పాటు క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. క్యూ లైన్ లో సైతం ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు.
News October 10, 2025
IPS పూరన్ కుమార్ ఆత్మహత్యపై SIT

సీనియర్ IPS అధికారి <<17962864>>పూరన్ కుమార్<<>> ఆత్మహత్యపై హరియాణా ప్రభుత్వం ఆరుగురితో సిట్ ఏర్పాటు చేసింది. చండీగఢ్ ఐజీ పుష్పేంద్రకుమార్ దీనికి నేతృత్వం వహిస్తారు. SSP కన్వర్‌దీప్ కౌర్, ఎస్పీ కేఎం ప్రియాంక, డీఎస్పీ చరణ్‌జీత్ సింగ్, గుర్జీత్ కౌర్, జైవీర్ రాణా సభ్యులు. అన్ని కోణాల్లో సత్వర, నిష్పాక్షిక విచారణకు సిట్‌ను ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోగా నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.