News October 10, 2025

NLG: రైతు కష్టం నీళ్ల పాలు.. పట్టించుకోకపోతే ఎట్లా?

image

నకిరేకల్ మండలంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను కొనుగోలు కేంద్రాల‌కు తీసుకొచ్చినా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోస పడుతున్నారు. ఇటీవల కురిసిన ఆకాల వర్షానికి మండలంలోని PACS కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 500 బస్తాలకుపైగా ధాన్యం నీళ్లు, మట్టి పాలైంది. 20 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు వాపోతున్నారు.

Similar News

News October 10, 2025

యాదాద్రి: ఫోన్‌లో మాట్లాడి.. ఉరేసుకున్న యువకుడు.!

image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ నల్ల శంకర్ (22) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 9 రాత్రి తల్లిదండ్రులు వేరే ఇంటికి వెళ్లగా, శంకర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఈరోజు ఉదయం 6 గంటలకు వంటగది పైకప్పుకు చీరతో ఉరేసుకుని కనిపించాడు. ఓ అమ్మాయితో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని ఫిర్యాదు అందినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 10, 2025

ఇంత నిర్లక్ష్యం దేనికి ఈశ్వరా..?

image

శ్రీకాళహస్తి ఆలయంలో మరోసారి భద్రత వైఫల్యం వెలుగు చూసింది. గురువారం తమిళనాడుకు చెందిన భక్తులు రూ.750 రాహు–కేతు పూజ అనంతరం వాయిలింగేశ్వరుడి దర్శనం ముగించుకుని నాగశిలను ఆలయంలో ప్రతిష్ఠాపన చేసే ప్రయత్నం చేశారు. ఆలయ మహాద్వారం వద్ద హోమ్ గార్డులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. భక్తులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

News October 10, 2025

భూ సేకరణ సమస్యలు త్వరితగతన పరిష్కరించాలి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ రెవిన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు.