News October 10, 2025
VKB: అడవి పందులను తప్పించబోయి.. వ్యక్తి దుర్మరణం

అడవి పందులను తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి జుంటిపల్లికి చెందిన రాంచందర్(46) మృతి చెందారు. ఎస్సై విఠల్ రెడ్డి ప్రకారం.. రాంచందర్ తాండూరు నుంచి వస్తుండగా కోకట్ బైపాస్ వద్ద అడవి పందుల గుంపు అడ్డు వచ్చింది. వాటిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 10, 2025
యాదాద్రి: ఫోన్‌లో మాట్లాడి.. ఉరేసుకున్న యువకుడు.!

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ నల్ల శంకర్ (22) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 9 రాత్రి తల్లిదండ్రులు వేరే ఇంటికి వెళ్లగా, శంకర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఈరోజు ఉదయం 6 గంటలకు వంటగది పైకప్పుకు చీరతో ఉరేసుకుని కనిపించాడు. ఓ అమ్మాయితో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని ఫిర్యాదు అందినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 10, 2025
ఇంత నిర్లక్ష్యం దేనికి ఈశ్వరా..?

శ్రీకాళహస్తి ఆలయంలో మరోసారి భద్రత వైఫల్యం వెలుగు చూసింది. గురువారం తమిళనాడుకు చెందిన భక్తులు రూ.750 రాహు–కేతు పూజ అనంతరం వాయిలింగేశ్వరుడి దర్శనం ముగించుకుని నాగశిలను ఆలయంలో ప్రతిష్ఠాపన చేసే ప్రయత్నం చేశారు. ఆలయ మహాద్వారం వద్ద హోమ్ గార్డులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. భక్తులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
News October 10, 2025
భూ సేకరణ సమస్యలు త్వరితగతన పరిష్కరించాలి: కలెక్టర్

కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ రెవిన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు.