News October 10, 2025
గాంధారి: చెరువులో పడి మహిళ మృతి

గాంధారి మండలం పెద్ద పొతంగల్‌కు చెందిన దుర్కి సాయవ్వ(40) గిద్దల చెరువులో పడి మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామంలో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. గురువారం ఉదయం కాలకృత్యాలు వెళ్లి కాలుజారి చెరువులో పడి మృతి చెందింది. దీంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె కూతురు సౌందర్య ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 10, 2025
సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.
News October 10, 2025
సంగారెడ్డి: భగీరథ నీటి సరఫరా బంద్

సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, కోహిర్, ఝరాసంఘం, జహీరాబాద్, మొగుడంపల్లి, కంది, సదాశివపేట, కొండాపూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ, పటాన్‌చెరు మండలాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈఈ విజయలక్ష్మి తెలిపారు. సింగూరు ఆనకట్ట సమీపంలోని బూసరెడ్డిపల్లి నీటి శుద్ధి కర్మాగారంలో మరమ్మతుల కారణంగా శనివారం మ. 12 గంటల నుంచి ఆదివారం సాం. 8 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు.
News October 10, 2025
బ్రహ్మసముద్రంలో కేజీబీవీ విద్యార్థి మృతి

బ్రహ్మసముద్రం కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న చందన శుక్రవారం మృతి చెందిందినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. వారి వివరాల మేరకు.. పడమటి కోడిపల్లి గొల్లల దొడ్డికి చెందిన చందన కేజీబీవీలో చదువుతోంది. కడుపు నొప్పి అధికంగా ఉందని SO మహాలక్ష్మికి చెప్పింది. చందనను SO, తల్లిదండ్రులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.