News October 10, 2025

ADB: తండ్రి మరణ వార్త విని కుమారుడి ఆత్మహత్యాయత్నం

image

తండ్రి సూసైడ్ చేసుకోవడంతో కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ADB జిల్లాలో జరిగింది. బజార్హత్నూర్ మం. వర్తమన్నూర్‌కు చెందిన విజయ్‌కుమార్ పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి శ్రీరాంకాలనీలోని ఇంట్లో ఉరేసుకున్నాడు. దీంతో చిన్నకుమారుడు బస్సులో వస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని రిమ్స్‌కు తరలించారు. కడుపు నొప్పి భరించలేక ఉరేసుకున్నట్లు కుటుంబీకులు ఫిర్యాదు చేశారని మావల SI తెలిపారు.

Similar News

News October 10, 2025

నిర్మల్: పత్తి కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలి

image

పత్తి పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్‌లో పత్తి పంట కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి పంట కొనుగోలు ప్రక్రియను నిర్ణిత సమయానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు.

News October 10, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి: అదనపు కలెక్టర్

image

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కొనుగోలు కమిటీ ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు జారీ చేసిన టోకెన్లు కలిగిన రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

News October 10, 2025

సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

image

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.