News October 10, 2025
ఖమ్మం: ఎన్నికలకు బ్రేక్.. ఆశావహుల కలలు ఆవిరి

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 42% రిజర్వేషన్ ఆధారంగా పోటీ చేయాలనుకున్న ఉమ్మడి జిల్లాలోని బీసీ ఆశావహుల కలలు ఆవిరయ్యాయి. దీంతో బీసీలకు నిరాశే మిగిలిందని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశాలతో జిల్లా అధికారులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (ఎంసీసీ) ఎత్తివేశారు. ఇక కొత్త నోటిఫికేషన్‌పై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 10, 2025
నిర్మల్: పత్తి కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలి

పత్తి పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్‌లో పత్తి పంట కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి పంట కొనుగోలు ప్రక్రియను నిర్ణిత సమయానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు.
News October 10, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి: అదనపు కలెక్టర్

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కొనుగోలు కమిటీ ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు జారీ చేసిన టోకెన్లు కలిగిన రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
News October 10, 2025
సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.