News October 10, 2025

విజయవాడలో స్మార్ట్ వెండింగ్ మార్కెట్

image

VJA విద్యాధరపురం RTC డిపో సమీపంలో మెప్మా ఆధ్వర్యంలో స్మార్ట్ వెండింగ్ మార్కెట్ తరహా ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా మార్కెట్‌ను ఇప్పటికే నెల్లూరులో ఏర్పాటు చేశారు. పొదుపు మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, ఫుడ్ కోర్టులు, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు మెప్మా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. తొలి విడతలో 40 దుకాణాల ఏర్పాటుకు అనుమతులు కోరినట్లు మెప్మా అధికారులు తెలిపారు.

Similar News

News October 10, 2025

సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

image

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.

News October 10, 2025

సంగారెడ్డి: భగీరథ నీటి సరఫరా బంద్

image

సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, కోహిర్, ఝరాసంఘం, జహీరాబాద్, మొగుడంపల్లి, కంది, సదాశివపేట, కొండాపూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ, పటాన్‌చెరు మండలాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈఈ విజయలక్ష్మి తెలిపారు. సింగూరు ఆనకట్ట సమీపంలోని బూసరెడ్డిపల్లి నీటి శుద్ధి కర్మాగారంలో మరమ్మతుల కారణంగా శనివారం మ. 12 గంటల నుంచి ఆదివారం సాం. 8 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు.

News October 10, 2025

బ్రహ్మసముద్రంలో కేజీబీవీ విద్యార్థి మృతి

image

బ్రహ్మసముద్రం కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న చందన శుక్రవారం మృతి చెందిందినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. వారి వివరాల మేరకు.. పడమటి కోడిపల్లి గొల్లల దొడ్డికి చెందిన చందన కేజీబీవీలో చదువుతోంది. కడుపు నొప్పి అధికంగా ఉందని SO మహాలక్ష్మికి చెప్పింది. చందనను SO, తల్లిదండ్రులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.