News October 10, 2025

సంగారెడ్డి: నేడు ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ పోటీలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 ఫుట్ బాల్ పోటీలు మెదక్‌లోని వెస్లీ కళాశాలలో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

Similar News

News October 10, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి: అదనపు కలెక్టర్

image

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కొనుగోలు కమిటీ ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు జారీ చేసిన టోకెన్లు కలిగిన రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

News October 10, 2025

సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

image

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.

News October 10, 2025

సంగారెడ్డి: భగీరథ నీటి సరఫరా బంద్

image

సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, కోహిర్, ఝరాసంఘం, జహీరాబాద్, మొగుడంపల్లి, కంది, సదాశివపేట, కొండాపూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ, పటాన్‌చెరు మండలాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈఈ విజయలక్ష్మి తెలిపారు. సింగూరు ఆనకట్ట సమీపంలోని బూసరెడ్డిపల్లి నీటి శుద్ధి కర్మాగారంలో మరమ్మతుల కారణంగా శనివారం మ. 12 గంటల నుంచి ఆదివారం సాం. 8 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు.