News October 10, 2025

ఇండియన్ బ్యాంక్‌లో 171 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

ఇండియన్ బ్యాంక్‌లో వివిధ విభాగాల్లో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి CA/CWA/ICWA, పీజీ, బీఈ/బీటెక్, ఎంసీఏ/ఎమ్మెస్సీ, డిగ్రీ, ఎంబీఏతోపాటు పని అనుభవం ఉన్న వారు ఈ నెల 13వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 23-36 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianbank.bank.in/

Similar News

News October 10, 2025

సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

image

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.

News October 10, 2025

ADR తప్పుడు అఫిడవిట్లపై సుప్రీం అసంతృప్తి

image

AP: బిహార్‌ SIRపై దాఖలైన కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్ సమర్పించిన అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పేర్లు తొలగించారంటూ అఫిడవిట్లో పేర్కొన్నవారు సరైన పత్రాలు అందించలేదని ECI న్యాయవాది ద్వివేది తెలిపారు. ఇలాంటివి మరిన్ని ఉన్నాయని, వెరిఫై సాధ్యం కాదని ప్రశాంత్ భూషణ్ సమర్థించుకోబోయారు. అయితే తమకు సమర్పించే ముందే పరిశీలించాల్సిన బాధ్యత లేదా అని ప్రశాంత్, ADRలను కోర్టు ప్రశ్నించింది.

News October 10, 2025

నోబెల్ పీస్ ప్రైజ్ గెలిస్తే ఎన్ని రూ.కోట్లు ఇస్తారంటే?

image

నోబెల్ <<17966688>>పీస్ ప్రైజ్<<>> ప్రకటించిన నేపథ్యంలో ఈ బహుమతి గెలిచిన వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారన్న అంశంపై చర్చ మొదలైంది. నోబెల్ శాంతి బహుమతి విజేతకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్(దాదాపు రూ.10.25 కోట్లు) ప్రైజ్ మనీ, పతకం ఇస్తారు. మరోవైపు ట్రంప్‌కు నోబెల్ ఇవ్వకపోవడంపై కమిటీ వివరణ ఇచ్చింది. ఆయన పేరిట వచ్చిన నామినేషన్లు అన్నీ గడువు(జనవరి 31) ముగిశాక వచ్చినవేనని స్పష్టం చేసింది.