News October 10, 2025

కడప జిల్లాలో ఈ దగ్గు సిరప్‌ నిషేధం

image

‘RespiFresh-TR’ దగ్గు సిరప్‌లో నిషేధిత DEG సాల్వెంట్ 35 శాతం పైగా ఉండటంతో దాన్ని ప్రభుత్వం నిషేధించిందని ఔషధ నియంత్రణ శాఖ కర్నూలు డీడీ నాగ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఆ సిరప్‌‌ను టెస్ట్ చేసినప్పుడు, వాటిలో రెండు కంపెనీల మందుల్లో నిషేధిత DEG సాల్వెంట్ బయట పడిందన్నారు. ఇందులో ‘RespiFresh-TR’ సిరప్ ఏపీ మార్కెట్లోకి వచ్చినట్లు గుర్తించామన్నారు. కడప జిల్లా 24 బాటిళ్లను గుర్తించి రిటర్న్ చేశామన్నారు.

Similar News

News October 10, 2025

పాడేరు: ‘సూపర్ జీఎస్టీపై అందరికి అవగాహన అవసరం’

image

సూపర్ జీఎస్టీపై అందరికి అవగాహన అవసరమని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సూపర్ జీఎస్టీ-2.0 అన్నివర్గాలకు ప్రయోజనకరమని అన్నారు. పాడేరు కాఫీ హౌస్‌లో వాణిజ్య పన్నులశాఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రదర్శన, విక్రయాలను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. అన్ని వర్గాలకు ప్రయోజనం కల్పించే విధంగా జీఎస్టీ శ్లాబులను కేంద్ర ప్రభుత్వం సవరించిందని అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 10, 2025

గర్భిణులు, తల్లులకు అలర్ట్!

image

గర్భధారణ నుంచి రెండేళ్ల వరకు తల్లులకు, పిల్లల మొదటి 1,000 రోజుల్లో వారికి అదనంగా చక్కెర అందించొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ‘తక్కువ చక్కెర తీసుకునే చిన్నారులలో జ్ఞాపకశక్తి& ఏకాగ్రత మెరుగ్గా ఉంటాయి. పెద్దయ్యాక షుగర్, BP ప్రమాదం తగ్గుతుంది. తల్లి తీసుకునే పోషకాహారం బిడ్డ భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్మిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
* ప్రతిరోజూ మహిళల కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>>పై క్లిక్ చేయండి

News October 10, 2025

జగిత్యాల: ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలి: అడిషనల్ కలెక్టర్

image

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జగిత్యాల జిల్లాలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణకు సహకార సంఘాలు సిద్ధంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్లో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణపై శుక్రవారం సహకార సంఘాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం సేకరణకు వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పౌరసరఫరాల అధికారి, మేనేజర్ తదితరులున్నారు.