News October 10, 2025
ట్రాన్స్‌జెండర్‌కు టికెట్.. పీకే ప్లాన్ పనిచేసేనా?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. నిన్న తొలి విడతలో భాగంగా 51 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ అధికారులు & పోలీసులు సహా ట్రాన్స్‌జెండర్ సోషల్ యాక్టివిస్ట్ ప్రీతి కిన్నర్ కూడా ఉన్నారు. ‘వీరికి ఓట్లు వేయకపోతే నాకు నష్టం లేదు.. బిహార్ ప్రజలే ఆ భారం మోయాలి’ అంటూ పీకే మాటల గారడీకి తెరలేపారు.
Similar News
News October 10, 2025
నోబెల్ ప్రైజ్ ప్రతిష్ఠ కోల్పోయింది: పుతిన్

NOBEL పీస్ ప్రైజ్‌కు వెనిజులా విపక్ష నేత మరియా ఎంపికవడం తెలిసిందే. దీనిపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పందించారు. ‘ట్రంప్ అన్నివిధాలా అర్హులు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారు. శాంతికోసం పనిచేయని పలువురికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది తన ప్రతిష్ఠను కోల్పోయింది’ అని వ్యాఖ్యానించారు. అటు ‘శాంతిపై నోబెల్‌వి మాటలే. ట్రంప్ చేసి చూపించారు. ప్రైజ్‌కు అర్హులు’ అని నెతన్యాహు అన్నారు.
News October 10, 2025
కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీం తీర్పు రిజర్వ్

కరూర్ తొక్కిసలాటపై SIT ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ TVK దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. TN పోలీసు అధికారులతోనే SIT ఏర్పాటు చేయాలనే HC తీర్పును వ్యతిరేకించింది. ఆపై జడ్జిలు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజరియాతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కరూర్‌లో TVK విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
News October 10, 2025
బిహార్‌లో రేపు NDA కూటమి సమావేశం

త్వరలో బిహార్‌లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో NDA కూటమి రేపు అక్కడ కీలక సమావేశం నిర్వహించనుంది. JDU, BJPతో పాటు కూటమిలోని ఇతర పార్టీల సీట్ల పంపకాలపై ఇందులో చర్చించనున్నారు. మొత్తం 243 సీట్లలో జేడీయూ, బీజేపీ 205 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏయే స్థానాల్లో ఎవరెవరు బరిలో దిగాలనే అంశంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా తొలి విడత ఎన్నికలకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.