News October 10, 2025

సిరిసిల్ల: భార్య లేదని వృద్ధుడు ఆత్మహత్య

image

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. SI రాహుల్ రెడ్డి దీనిపై కేసు నమోదు చేశారు. పోతు అంజయ్య(70) కొద్ది నెలలుగా మూత్ర, మలవిసర్జన వ్యాధితో బాధపడుతున్నాడు. మృతుడి భార్య ఏడాది క్రితం చనిపోయింది. అనారోగ్య సమస్యలతో పాటు భార్య లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన అంజయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అక్క కళావతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 10, 2025

నోబెల్ ప్రైజ్ ప్రతిష్ఠ కోల్పోయింది: పుతిన్

image

NOBEL పీస్ ప్రైజ్‌కు వెనిజులా విపక్ష నేత మరియా ఎంపికవడం తెలిసిందే. దీనిపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పందించారు. ‘ట్రంప్ అన్నివిధాలా అర్హులు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారు. శాంతికోసం పనిచేయని పలువురికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది తన ప్రతిష్ఠను కోల్పోయింది’ అని వ్యాఖ్యానించారు. అటు ‘శాంతిపై నోబెల్‌వి మాటలే. ట్రంప్ చేసి చూపించారు. ప్రైజ్‌కు అర్హులు’ అని నెతన్యాహు అన్నారు.

News October 10, 2025

కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీం తీర్పు రిజర్వ్

image

కరూర్ తొక్కిసలాటపై SIT ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ TVK దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. TN పోలీసు అధికారులతోనే SIT ఏర్పాటు చేయాలనే HC తీర్పును వ్యతిరేకించింది. ఆపై జడ్జిలు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజరియాతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కరూర్‌లో TVK విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

News October 10, 2025

HYD: అక్టోబర్ 12న పోలియో చుక్కలు

image

నిండు ప్రాణానికి- రెండు చుక్కలు నినాదంతో అక్టోబర్ 12న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు DMHO డా.లలితాదేవి తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. HYD, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాలో నిర్వహిస్తున్నారు. RR జిల్లా పట్టణ ప్రాంతంలో 1,99,967 మందికి, గ్రామీణ ప్రాంతంలో 2,20,944 మొత్తం 4,20,911 చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.