News October 10, 2025
HYD: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు గంజాయి మత్తులో బాలిక సోదరుడి ముందే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అనారోగ్యానికి గురి అవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బాధితురాలి తల్లి సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 11, 2025
OU: విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, జూనియర్ డిప్లొమా ఇన్ జర్మన్, సీనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, సీనియర్ డిప్లొమా ఇన్ జర్మన్ కోర్సుల పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
News October 11, 2025
బేగంపేట్ సీఎం ప్రజావాణికి 275 దరఖాస్తులు

బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 275 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 76, రెవెన్యూ శాఖకు సంబంధించి 43, ఇందిరమ్మ ఇళ్ల కోసం 85, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 69 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
News October 10, 2025
గ్రూప్-1 ర్యాంకర్‌ను సన్మానించిన HYD కలెక్టర్

గ్రూప్-1 ద్వారా ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్‌గా ధనసిరి దివ్య ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన దాసరి శుక్రవారం లక్డికాపూల్‌లోని కలెక్టరేట్‌లో ఆమెను సన్మానించారు. కలెక్టర్ ఉద్యోగ సాధన అభినందించి, దివ్యని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.