News April 7, 2024

గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలును గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు (07169) ఈనెల 14, 21, 28 తేదీల్లో నర్సాపూర్‌లో 18.00 గంటలకు బయలుదేరి, విజయవాడ 21, 35, గుంటూరు 22: 45 సత్తెనపల్లి 23.24, పిడుగురాళ్ల 23: 56 సికింద్రాబాద్ 04.50 గంటలకు చేరుతుంది.

Similar News

News October 4, 2025

ఖరీఫ్‌లో 50 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

image

ఖరీఫ్ సీజన్ 2025-26లో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ హాలులో జరిగిన జిల్లా ధాన్య సేకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 3,89,849 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందన్నారు. ఇప్పటికే, డిసెంబర్ 2025 నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు.

News October 4, 2025

కాలుష్య నివారణ చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

గుంటూరు GMC పరిధిలో గాలి నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడానికి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ VC హాలులో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా GMC పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం జరిగింది. కాలుష్య నివారణ, రహదారుల అభివృద్ధి, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

News October 3, 2025

గుంటూరులో ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో ఎస్పీ

image

SP వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో పాల్గొన్నారు. ఐదుగురు పోలీస్ సిబ్బంది తమ బదిలీ, సర్వీస్ సంబంధిత సమస్యలపై వినతి పత్రాలను SPకి సమర్పించారు. SP వాటిని సానుకూలంగా స్వీకరించి, సంబంధిత అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి, వారి వినతుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని SP పేర్కొన్నారు.