News October 10, 2025

జనగామ: టీహెచ్ఆర్ నమోదులో అష్టకష్టాలు

image

జనగామ జిల్లాలోని అంగన్వాడీ, పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు అందించే రేషన్(టీహెచ్ఆర్)లో కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. టీహెచ్ఆర్ యాప్‌లో పిల్లల తల్లిదండ్రుల ఫొటో క్యాప్చర్ నమోదులో అష్టకష్టాలు పడుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News October 10, 2025

రేపు ఉదయం లోగా వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30గంటల లోపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలకు ఛాన్స్ ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?

News October 10, 2025

తిరుపతి: గ్యాంగ్ రేప్.. ఇద్దరికి జైలుశిక్ష

image

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన యువతి(19) తన స్నేహితుడితో కలిసి స్థానిక రైల్వే స్టేషన్ దగ్గరకు 2019 ఫిబ్రవరి 3న వెళ్లింది. అక్కడ నలుగురు యువకులు స్నేహితుడిని కొట్టి డబ్బులు తీసుకున్నారు. యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు. నిందితుల్లో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు తిరువళ్లూరు నవీన్ కుమార్(బొగ్గుల కాలనీ సూళ్లూరుపేట), కాకుల దేవ(సాయి నగర్, సూళ్లూరుపేట)కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

News October 10, 2025

నోబెల్ ప్రైజ్ ప్రతిష్ఠ కోల్పోయింది: పుతిన్

image

NOBEL పీస్ ప్రైజ్‌కు వెనిజులా విపక్ష నేత మరియా ఎంపికవడం తెలిసిందే. దీనిపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పందించారు. ‘ట్రంప్ అన్నివిధాలా అర్హులు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారు. శాంతికోసం పనిచేయని పలువురికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది తన ప్రతిష్ఠను కోల్పోయింది’ అని వ్యాఖ్యానించారు. అటు ‘శాంతిపై నోబెల్‌వి మాటలే. ట్రంప్ చేసి చూపించారు. ప్రైజ్‌కు అర్హులు’ అని నెతన్యాహు అన్నారు.