News October 10, 2025

MDK: స్థానిక ఎన్నికలపై.. చిగురించి ఆవిరైనా ఆశలు

image

స్థానిక ఎన్నికలపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించి ఆవిరైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ విషయంలో హైకోర్టులో విచారణ ఉండగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రారంభించారు. గురువారం ఉదయం నామినేషన్లు ప్రారంభించడంతో సాయంత్రం హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురించి ఆవిరయ్యాయి.

Similar News

News October 9, 2025

శివంపేట: అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

image

శివంపేట మండలం పంబండ గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ గురువారం విచారణ చేపట్టారు. 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిలో ఇల్లు నిర్మిస్తున్న ఎస్సీ కులానికి చెందిన జానకిని కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించి, గొడ్డలితో దాడికి ప్రయత్నించినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

News October 9, 2025

MDK: మైనర్ బాలికను వివాహం చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు

image

13 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకున్న 34 ఏళ్ల వ్యక్తిపై చిలిపి చేడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మైనర్ బాలిక వివాహం జరిగినట్టు గుర్తించిన ఐసీడీఎస్ జిల్లా అధికారి హేమ భార్గవి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైనర్ బాలికను వివాహం చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాల్యవివాహాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

News October 9, 2025

MDK: అందని ద్రాక్షల గ్యాస్ సబ్సిడీ డబ్బులు!

image

అందని ద్రాక్షల గ్యాస్ సబ్సిడీ తయారయింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 2,35,412 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో 17 ఏజెన్సీల పరిధిలో వినియోగదారులు హెచ్పీ, బీపీ, ఐఓసీ నుంచి గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారు. సిలిండర్ ధర 922 ఉండగా 374 సబ్సిడీగా అందేది. కానీ 5 నెలలుగా సబ్సిడీ అందడం లేదని గ్రామాల ప్రజలు అంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని వేడుకుంటున్నారు.