News October 10, 2025

ఆహారం తినకూడని వేళలు

image

శరీరం దైవత్వంతో నిండాలంటే, ఆహారం తీసుకునే విషయంలో పవిత్ర నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యాస్తమయ సమయంలోని అసుర సంధ్య వేళలో ఎట్టి పరిస్థితుల్లో ఆహారం ముట్టకూడదు. ఆ సమయంలో దైవ ధ్యానం, ప్రశాంతత ముఖ్యం. రాత్రి పడుకునే ముందు కూడా భోజనం చేయకూడదు. ఒకవేళ చేస్తే.. ఏకాగ్రత తగ్గుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. సూర్య గ్రహణానికి 12 గంటలు, చంద్ర గ్రహణానికి 9 గంటల ముందు నుంచే ఉపవాసం ఉండాలి.

Similar News

News October 10, 2025

రేపు ఉదయం లోగా వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30గంటల లోపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలకు ఛాన్స్ ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?

News October 10, 2025

నోబెల్ ప్రైజ్ ప్రతిష్ఠ కోల్పోయింది: పుతిన్

image

NOBEL పీస్ ప్రైజ్‌కు వెనిజులా విపక్ష నేత మరియా ఎంపికవడం తెలిసిందే. దీనిపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పందించారు. ‘ట్రంప్ అన్నివిధాలా అర్హులు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారు. శాంతికోసం పనిచేయని పలువురికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది తన ప్రతిష్ఠను కోల్పోయింది’ అని వ్యాఖ్యానించారు. అటు ‘శాంతిపై నోబెల్‌వి మాటలే. ట్రంప్ చేసి చూపించారు. ప్రైజ్‌కు అర్హులు’ అని నెతన్యాహు అన్నారు.

News October 10, 2025

కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీం తీర్పు రిజర్వ్

image

కరూర్ తొక్కిసలాటపై SIT ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ TVK దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. TN పోలీసు అధికారులతోనే SIT ఏర్పాటు చేయాలనే HC తీర్పును వ్యతిరేకించింది. ఆపై జడ్జిలు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజరియాతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కరూర్‌లో TVK విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.