News October 10, 2025
బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల భూమి స్వాధీనం

బంజారాహిల్స్ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల విలువైన భూమి ఇది. ఫేక్ సర్వే నంబర్ 403/52తో ఓ వ్యక్తి భూమి తనదంటూ క్లెయిమ్ చేసుకొని ఫెన్సింగ్, షెడ్లు, బౌన్సర్లు, కుక్కలతో కాపలా ఏర్పాటు చేశారు. జలమండలి వాటర్ రిజర్వాయర్ పనులను అడ్డుకున్నాడు. దీనిపై హైడ్రా అధికారులకు సమాచారం అందింది. శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా, రెవెన్యూ, జలమండలి సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టారు.
Similar News
News October 10, 2025
గచ్చిబౌలిలో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు

గ్రేస్ క్యాన్సర్ రన్ నేపథ్యంలో ఆదివారం గచ్చిబౌలి పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉ.5:30 నుంచి 8:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ప్రకటనలో తెలిపారు. 10 కిలోమీటర్ల ఈ పరుగు గచ్చిబౌలి మెయిన్ స్టేడియం నుంచి IIIT జంక్షన్, విప్రో జంక్షన్ మీదుగా సాగుతుందన్నారు. విప్రో జంక్షన్ నుంచి IIIT వైపు వెళ్లే వాహనాలను వేరే దారిలో మళ్లించనున్నట్లు తెలిపారు.
News October 10, 2025
జగిత్యాల: మానసిక ఆరోగ్యంపై విస్తృత అవగాహన

ప్రజల మానసిక ఆరోగ్యంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్చన తెలిపారు. జగిత్యాలలోని జె.ఎస్.రామ్ వెల్ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ అర్చన, వైద్య సిబ్బంది ప్రజలకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరించి అవగాహన కల్పించారు. వైద్యాధికారి కృష్ణకుమారితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
News October 10, 2025
తాండూరు: కొడుకు చితికి కొరివి పెట్టిన తల్లి

ఫిట్స్‌తో మృతి చెందిన కుమారుడికి దహన సంస్కారాలను నిర్వహించి చితికి తల్లి కొరివి పెట్టిన ఘటన తాండూరులో చోటుచేసుకుంది. మాదారం టౌన్షిప్‌కు చెందిన రాజమ్మ భర్త సింగరేణిలో పనిచేస్తూ చాలా ఏళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కొడుకులలో పెద్ద కొడుకు ఏడాది క్రితం మృతి చెందాడు. చిన్న కుమారుడు నరేష్ గురువారం ఫిట్స్‌తో మృతి చెందాగా శుక్రవారం తల్లి కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించింది.