News October 10, 2025

రేపు ధనధాన్య కృషి యోజన ప్రారంభం

image

దేశంలో వ్యవసాయ రంగ ఉత్పాదకతను మరింత పెంచేందుకు కేంద్రం ప్రకటించిన ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. జాతీయ సగటుకంటే తక్కువగా పంట ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపికచేశారు. ఈ జిల్లాల్లో సాగునీటి వ్యవస్థ, పంట నిల్వ సామర్థ్యం, రుణసదుపాయం, పంటసాగులో వైవిధ్యం పెంచడానికి కేంద్రం చేయూతనందిస్తుంది. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయంతో ఆరేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేస్తారు.

Similar News

News October 10, 2025

గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ బర్త్‌డే సెలబ్రేషన్స్

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన ప్రేయసిని అభిమానులకు పరిచయం చేశారు. మోడల్ మహికా శర్మతో రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చారు. ఒకరోజు ముందే మహికాతో కలిసి హార్దిక్ తన బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమెతో కలిసి చిల్ అవుతున్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టారు. దీంతో వీళ్లిద్దరు రిలేషన్‌లో ఉన్నారని అధికారికంగా ప్రకటించినట్లు అయ్యింది.

News October 10, 2025

ఈ నెల 16న కర్నూలులో మోదీ సభ

image

AP: కర్నూలులో ఈ నెల 16న సూపర్ GST-సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. దీనికి PM మోదీతో పాటు CM, Dy.CM, మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు. ఆ రోజు ఉదయం మోదీ సున్నిపెంట హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. తర్వాత సభా ప్రాంగణానికి వెళ్లి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.

News October 10, 2025

పిల్లలు క్రాకర్స్ కాల్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి.. సుప్రీంకు వినతి

image

ఢిల్లీలో బాణసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. దేశ రాజధానిలో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం దృష్ట్యా బాణసంచా విక్రయం, వినియోగంపై ఈ ఏడాది APRలో SC నిషేధం విధించింది. ఇవాళ దీనిపై విచారణ జరగగా పండుగ కోసం పిల్లలు ఎదురుచూస్తున్నారని, పర్యావరణహితమైన క్రాకర్స్‌‌కు అనుమతించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీపావళి రోజు రా.8-10 గంటల మధ్య పర్మిషన్ ఇవ్వాలన్నారు.