News October 10, 2025
తిరుపతి: చెవిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వానికి నోటిసులు జారీ చేస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Similar News
News October 10, 2025
బాల్య వివాహ రహిత జిల్లా దిశగా పని చేద్దాం: కలెక్టర్

బాల్య వివాహ రహిత జిల్లా దిశగా అందరం కలిసికట్టుగా పని చేద్దామని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ కృష్ణ ప్రసాద్ సంయుక్తముగా అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ముద్రించిన ఆపండి బాల్య వివాహాలు.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.. ఉచిత హెల్ప్ లైన్ నెంబర్లు, చైల్డ్ హెల్ప్ లైన్ గోడ పత్రికలను వారు ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో బాల్య వివాహల నిర్మూలనకు సహకరించాలన్నారు.
News October 10, 2025
గచ్చిబౌలిలో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు

గ్రేస్ క్యాన్సర్ రన్ నేపథ్యంలో ఆదివారం గచ్చిబౌలి పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉ.5:30 నుంచి 8:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ప్రకటనలో తెలిపారు. 10 కిలోమీటర్ల ఈ పరుగు గచ్చిబౌలి మెయిన్ స్టేడియం నుంచి IIIT జంక్షన్, విప్రో జంక్షన్ మీదుగా సాగుతుందన్నారు. విప్రో జంక్షన్ నుంచి IIIT వైపు వెళ్లే వాహనాలను వేరే దారిలో మళ్లించనున్నట్లు తెలిపారు.
News October 10, 2025
దుకాణాలు నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేయాలి: అనిల్ కుమార్

దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలను ప్రభుత్వం సూచించిన విధంగానే ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. టపాసులు అమ్మే ప్రదేశంలో దుకాణదారులు ఫైర్, విద్యుత్ సేఫ్టీ నిబంధనలు తప్పకుండా పాటించాలని, తగిన రక్షణలతో అమ్మకాలు కొనసాగించాలని ఆయన సూచించారు.