News October 10, 2025

సత్యసాయి జిల్లాలో 409.6 మి.మీ వర్షపాతం నమోదు

image

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 409.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టరేట్ నుంచి అధికారులు తెలిపారు. జిల్లాలోని 32 మండలాలలో చిలమత్తూరు మినహా 31 మండలాలలో వర్షం పడినట్లు తెలిపారు. అత్యధికంగా పుట్టపర్తి 38.4, నల్లమాడ 36.0, పెనుకొండ 27.8, గాండ్లపెంట 25.6, అగళి 23.4, ఓడీసీ 22.6, సోమందపల్లి 21.2, రోళ్లలో 20.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు.

Similar News

News October 11, 2025

ముత్తాఖీ ప్రెస్‌మీట్‌.. ఉమెన్ జర్నలిస్టులకు నో ఇన్విటేషన్

image

ఇవాళ భారత పర్యటనకు వచ్చిన అఫ్గాన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాఖీ మంత్రి జైశంకర్‌తో భేటీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం ఇంకా లింగ వివక్ష చూపుతోందని భారత మహిళా జర్నలిస్టులు మండిపడుతున్నారు. పురుష జర్నలిస్టులు ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేసి నిరసన తెలపాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై మీరేమంటారు?

News October 11, 2025

బేగంపేట్‌ సీఎం ప్రజావాణికి 275 దరఖాస్తులు

image

బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 275 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 76, రెవెన్యూ శాఖకు సంబంధించి 43, ఇందిరమ్మ ఇళ్ల కోసం 85, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 69 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.

News October 11, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> దేవరుప్పుల: దాడి చేసిన వ్యక్తికి రిమాండ్
> జనగామలో సెల్ టవర్ నిర్మించొద్దని నిరసన
> ప్రధానమంత్రి దన్, ధ్యాన కృషి యోజన పథకానికి జిల్లా ఎంపిక
> కలెక్టరేట్ ఎదుట పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ జేఏసీ నిరసన
> అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచాలి: కలెక్టర్
> బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాలి: అదనపు కలెక్టర్
> రఘునాథపల్లి: కుక్కల దాడిలో 7 మేక పిల్లలు మృతి