News October 10, 2025

ADB: పిల్లల ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డు’

image

జీవితంలో రోజుకో గుడ్డు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతారు. పిల్లల ఎత్తు, బలం, మెదడు అభివృద్ధికి గడ్డు చాలా అవసరం. పేదరికం, పోషకాహార లోపం ఉన్న కుటుంబాలకు గడ్డు ఆర్థికంగా అందుబాటులో ఉండే ఉత్తమ ఆహారం. అంగన్వాడీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో విద్యార్థులకు గుడ్లు ఆహారంలో చేరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 250+హాస్టళ్లలో 40,000 మందికి గుడ్లు అందిస్తున్నారు.
#నేడు వరల్డ్ ఎగ్ డే

Similar News

News October 10, 2025

గ్రూప్-1 ర్యాంకర్‌ను సన్మానించిన HYD కలెక్టర్

image

గ్రూప్-1 ద్వారా ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్‌గా ధనసిరి దివ్య ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన దాసరి శుక్రవారం లక్డికాపూల్‌లోని కలెక్టరేట్‌‌లో ఆమెను సన్మానించారు. కలెక్టర్ ఉద్యోగ సాధన అభినందించి, దివ్యని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

News October 10, 2025

విశాఖ: ‘ధాన్యం సేకరణపై అప్రమత్తంగా ఉండాలి’

image

ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. విశాఖ జిల్లాలో 40 రైతు సేవా కేంద్రాల ద్వారా 10,000 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. కామన్ రకం క్వింటాకు రూ.2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధరగా నిర్ణయించారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 1967కి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

News October 10, 2025

గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ బర్త్‌డే సెలబ్రేషన్స్

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన ప్రేయసిని అభిమానులకు పరిచయం చేశారు. మోడల్ మహికా శర్మతో రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చారు. ఒకరోజు ముందే మహికాతో కలిసి హార్దిక్ తన బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమెతో కలిసి చిల్ అవుతున్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టారు. దీంతో వీళ్లిద్దరు రిలేషన్‌లో ఉన్నారని అధికారికంగా ప్రకటించినట్లు అయ్యింది.