News October 10, 2025

PKSM: తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా..?

image

తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ కోర్ పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. కేవైసీ పేరుతో జరిగే మోసాల పట్ల చైతన్యపరుస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ బ్యాంక్ కూడా కేవైసీ గురించి కాల్స్ చేసి ఓటీపీ అడగదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News October 11, 2025

ప్రకాశం: ‘అర్జీలు సకాలంలో పరిష్కరించాలి’

image

రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రెవిన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వచ్చే అర్జీలలో 80% రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలే ఉన్నాయన్నారు. నిర్ణీత గడువులోగా అర్జీలను అధికారులు పరిష్కరించాలన్నారు.

News October 10, 2025

త్వరలో ఉమ్మడి ప్రకాశంకు మహర్ధశ: CM

image

కృష్ణపట్నంతో పాటు దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నట్లు CM చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా దగదర్తి ఎయిర్ పోర్ట్ పూర్తయితే జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వస్తాయని, దీని వలన పేదరికం తగ్గే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఒంగోలు మీదుగా HYD-చెన్నై, చెన్నై-అమరావతికి బుల్లెట్ ట్రైన్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2047 కల్లా AP ఆర్థికంగా అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు.