News October 10, 2025
కాసేపట్లో నోబెల్ పీస్ ప్రైజ్.. టాప్ కంటెండర్స్ వీరే

నార్వేజియన్ నోబెల్ కమిటీ ఇవాళ 2.30PMకు పీస్ ప్రైజ్‌ను ప్రకటించనుంది. ఈ అవార్డు కోసం ట్రంప్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆయనతో పాటు ఎంతోమంది ప్రముఖులు రేసులో ఉన్నారు. 244 వ్యక్తులు, 94 సంస్థలు కలిపి మొత్తం 338 నామినేషన్స్ వచ్చాయి. రష్యా ప్రతిపక్ష నేత భార్య యూలియా, క్లైమెట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ సహా UN ఏజెన్సీస్ వంటి పలు సంస్థలు పోటీపడుతున్నాయి.
Similar News
News October 11, 2025
అఫ్గాన్ల సపోర్ట్ ఎప్పుడూ భారత్‌కే: పాక్

తాము ఎన్ని త్యాగాలు చేసినా అఫ్గాన్లు మాత్రం భారత్ వైపే ఉంటారని పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ విమర్శించారు. ‘చరిత్ర చూస్తే అఫ్గానిస్థాన్ ఎప్పుడూ భారత్‌కు విధేయంగానే ఉంది. నిన్న, ఇవాళ, రేపు కూడా అదే జరుగుతుంది’ అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో గత ప్రభుత్వాలు లక్షలాది మంది అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడాన్ని తప్పుబట్టారు. పాక్ ధాతృత్వం గుడ్ విల్‌గా మారలేదని అసహనం వ్యక్తం చేశారు.
News October 11, 2025
కనక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే?

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి. అలాగే.. విజయవాడ కనక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే యుగాంతమే అని కూడా చెప్పారు. ‘అంత ఎత్తయిన కొండపైకి కృష్ణా నీరు రావడమంటే, అది ప్రకృతి ప్రకోపానికి, ప్రళయానికి సంకేతం. ఆ పెను మార్పు సంభవించినప్పుడు లోకంలో జీవరాశి నిలవడం కష్టం. ఇది యుగాంతానికి దారి తీసే భయంకరమైన దైవిక సంకేతం’ అని పండితులు చెబుతున్నారు.
News October 11, 2025
ముత్తాఖీ ప్రెస్‌మీట్.. ఉమెన్ జర్నలిస్టులకు నో ఇన్విటేషన్

ఇవాళ భారత పర్యటనకు వచ్చిన అఫ్గాన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాఖీ మంత్రి జైశంకర్‌తో భేటీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం ఇంకా లింగ వివక్ష చూపుతోందని భారత మహిళా జర్నలిస్టులు మండిపడుతున్నారు. పురుష జర్నలిస్టులు ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేసి నిరసన తెలపాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై మీరేమంటారు?