News October 10, 2025
మైనారిటీ గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ

ఖమ్మం జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ ముజాహీద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఖమ్మం కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
Similar News
News October 10, 2025
KMM: రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల హాజరవుతారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు సకాలంలో హాజరు కావాలని వారు కోరారు.
News October 10, 2025
ఖమ్మం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో.. పీహెచ్‌సీల్లో 100% సిబ్బంది హాజరు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని, అధిక సీ-సెక్షన్ డెలివరీలు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎన్‌సీడీ సర్వే, టీకాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
News October 10, 2025
KMM: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీలలో పనిచేసే ప్రతి సిబ్బంది అటెండెన్స్‌ను ఆన్‌లైన్ చేసి, 100% మానిటరింగ్ చేయాలన్నారు. ప్రతి వైద్యాధికారి తన పరిధిలోని ఆశా కార్యకర్తలతో తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.