News October 10, 2025

సంగారెడ్డి: పది ప్రత్యేక తరగతులను పగడ్బందీగా నిర్వహించాలి: డీఈఓ

image

జిల్లాలలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, కేజీబీవీ, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ప్రతి వారం విద్యార్థులు లఘు పరీక్షలను నిర్వహించి వాటి ఫలితాలను రికార్డులో నమోదు చేయాలని సూచించారు.

Similar News

News October 11, 2025

హనీమూన్ కూడా మీరే ప్లాన్ చేయండి: త్రిష

image

పెళ్లికాని హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. అందుకే ఎప్పుడూ ఆమె పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఆమెకు చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి సెట్ అయ్యిందనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ‘వేరే వాళ్లు నా జీవితాన్ని ప్లాన్ చేయడం నాకు నచ్చుతుంది. వాళ్లే హనీమూన్ కూడా ప్లాన్ చేస్తారని వెయిట్ చేస్తున్నా’ అని సెటైరికల్ స్టోరీని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

News October 11, 2025

4 గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ: పవన్

image

AP: పంచాయతీలు బలోపేతం అవుతున్నాయని Dy.CM పవన్ అన్నారు. గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేస్తూ క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నామన్నారు. గ్రామ కార్యదర్శి పేరు పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేసినట్లు వివరించారు.

News October 11, 2025

OU: విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, జూనియర్ డిప్లొమా ఇన్ జర్మన్, సీనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, సీనియర్ డిప్లొమా ఇన్ జర్మన్ కోర్సుల పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.