News October 10, 2025

గద్వాల్: సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి

image

సమాచార హక్కు చట్టం ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఈనెల 5 నుంచి 12 వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గద్వాల ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా అధికారులకు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు.

Similar News

News October 11, 2025

చైనాకు ట్రంప్ మరోసారి హెచ్చరికలు

image

అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో చైనాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి ప్రతిచర్యగా చైనా ఉత్పత్తులపై మరోసారి భారీగా సుంకాలు తప్పవని హెచ్చరించారు. చైనాతో స్నేహంగా ఉంటున్నా తాజా చర్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ తరుణంలో జిన్‌పింగ్‌తో భేటీకి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మరో 2 వారాల్లో సౌత్ కొరియా పర్యటన సందర్భంగా జిన్ పింగ్‌తో ట్రంప్ భేటీ కావాల్సి ఉంది.

News October 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 11, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.19 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 11, 2025

పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిశీలించిన చిత్తూరు ఎస్పీ

image

చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎస్పీ తుషార్ డూడీ శుక్రవారం పరిశీలించారు. త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్‌లకు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గదులు పరిశుభ్రంగా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.