News October 10, 2025
మరియాకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌కు నిరాశ

2025కి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించింది. డెమొక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వెనిజులాను ఆమె డిక్టేటర్‌షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. అటు ఈ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నిరాశే మిగిలింది.
Similar News
News October 11, 2025
చైనాకు ట్రంప్ మరోసారి హెచ్చరికలు

అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో చైనాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి ప్రతిచర్యగా చైనా ఉత్పత్తులపై మరోసారి భారీగా సుంకాలు తప్పవని హెచ్చరించారు. చైనాతో స్నేహంగా ఉంటున్నా తాజా చర్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ తరుణంలో జిన్‌పింగ్‌తో భేటీకి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మరో 2 వారాల్లో సౌత్ కొరియా పర్యటన సందర్భంగా జిన్ పింగ్‌తో ట్రంప్ భేటీ కావాల్సి ఉంది.
News October 11, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 11, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.19 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.