News October 10, 2025
సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్/ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. ఢిల్లీ NCR, మహారాష్ట్రలో ఉద్యోగాలున్నాయి. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruit.southindianbank.bank.in/
Similar News
News October 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 11, 2025
శుభ సమయం (11-10-2025) శనివారం

✒ తిథి: బహుళ పంచమి రా.10.04 వరకు
✒ నక్షత్రం: రోహిణి రా.9.37 వరకు
✒ శుభ సమయం: ఉ.10.10-10.40, సా.5.50-సా.6.15
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
✒ వర్జ్యం: మ.2.02-3.32, రా.2.46-తె.4.16
✒ అమృత ఘడియలు: సా.6.35-8.05. * రోజూ పంచాంగం, రాశిఫలాల కోసం <<-se_10009>>ఈ కేటగిరీకి<<>> వెళ్లండి.
News October 11, 2025
నేటి ముఖ్యాంశాలు

*2047నాటికి దేశంలో నంబర్ వన్‌గా AP: చంద్రబాబు
*13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చేందుకు AP క్యాబినెట్ ఆమోదం
*అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు విడుదల
*TG: వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్
*BJP-RSS సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి: రాహుల్
*వెనెజులా MP మరియాకు నోబెల్ శాంతి బహుమతి
*నోబెల్ కమిటీపై వైట్ హౌజ్ విమర్శలు
*WIతో రెండో టెస్ట్ తొలి రోజు భారత్ స్కోర్ 318/2