News October 10, 2025
HYD: సిలిండర్ సమస్యలపై ఫిర్యాదు చేయండి!

ఓ వ్యక్తికి డెలివరీ అయిన సిలిండర్ లీకేజీ జరుగుతుందని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏంటి ఇంత అధ్వానంగా సిలిండర్ పంపిస్తారా.? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అధికారులు, HYDలో సిలిండర్ సమస్యలు ఏర్పడితే https://www.mopnge-seva.in/ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Similar News
News October 11, 2025
పల్నాడు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు

పల్నాడు జిల్లా కలెక్టర్ ఫొటోను ఉపయోగించి ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి, ప్రజలను మోసగించి డబ్బులు వసూలు చేస్తున్నారని జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ) తెలిపారు. “మీ నంబర్ పంపండి-ఫర్నీచర్ ఉంది” “డబ్బులు పంపండి” అంటూ సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి నకిలీ ఫేస్‌బుక్ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు.
News October 11, 2025
పాల్వంచలో మరో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మరో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందడుగు పడింది. కొత్తగా ఒకటి లేదా రెండు ప్లాంట్ల ఏర్పాటుపై నివేదిక తయారు చేయాలని జెన్‌కో యాజమాన్యం శుక్రవారం ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది. 800 మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా సూపర్ క్రిటికల్ విధానంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
News October 11, 2025
ADB: అమ్మను కాపాడుకుందాం..!

MHకు చెందిన దంపతులు భీంపూర్ మండలానికి చెందిన ఓ బాలికను రూ.10వేలకు విక్రయించిన విషయం తెలిసిందే. జిల్లాలో తరచూ బాల్య వివాహాలు, పోక్సో కేసులు నమోదవుతున్నాయి. నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతినబూనుదాం. బాలికలకు అండగా నిలబడుతామని, వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మికులుగా మార్చడం వంటివి చేస్తే 1098, 112, 1081, 100 నంబర్లకి కాల్ చేసి చెబుదాం.
#నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం
SHARE IT