News October 10, 2025

ఏలూరు: బాత్‌రూమ్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

ఏలూరు శనివారపు పేటకు చెందిన ఆటో డ్రైవర్ ఎర్ర వెంకటేశ్వరరావు (48) శుక్రవారం స్నానాల గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమవరంలో కూతురు బీటెక్ చదువుతుండటంతో 9 నెలలుగా భార్యతో సహా వెంకటేశ్వరరావు అక్కడే ఉంటున్నారు ఇటీవల వ్యక్తిగత పనులపై ఆయన ఏలూరు వచ్చి ఉంటున్నాడు. త్రీ టౌన్ సీఐ కోటేశ్వరరావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 11, 2025

వారిపై నిఘా ఉంచండి: గుంటూరు రేంజ్ IG

image

రానున్న దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు దీపావళి భద్రతపై అవగాహన కల్పించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులతో ఐజీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ఆర్థికనేరాలలో టాప్ 10 ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. రాత్రీ పగలు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.

News October 11, 2025

చైనాకు ట్రంప్ మరోసారి హెచ్చరికలు

image

అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో చైనాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి ప్రతిచర్యగా చైనా ఉత్పత్తులపై మరోసారి భారీగా సుంకాలు తప్పవని హెచ్చరించారు. చైనాతో స్నేహంగా ఉంటున్నా తాజా చర్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ తరుణంలో జిన్‌పింగ్‌తో భేటీకి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మరో 2 వారాల్లో సౌత్ కొరియా పర్యటన సందర్భంగా జిన్ పింగ్‌తో ట్రంప్ భేటీ కావాల్సి ఉంది.

News October 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 11, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.19 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.