News October 10, 2025
కాఫ్ సిరప్ డెత్స్‌పై పిల్.. కొట్టేసిన సుప్రీంకోర్టు

దగ్గు మందు తాగి 20మందికి పైగా చిన్నారులు చనిపోయిన ఘటనపై దాఖలైన పిల్‌ను SC కొట్టేసింది. CBI దర్యాప్తు చేయాలని, డ్రగ్ సేఫ్టీపై రివ్యూ నిర్వహించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు. ఆయా రాష్ట్రాలు ఈ కేసు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. CBIతో దర్యాప్తు అవసరం లేదన్నారు. దీంతో CJIతో కూడిన ధర్మాసనం పిల్‌ను డిస్మిస్ చేసింది.
Similar News
News October 11, 2025
అఫ్గాన్‌ను భారత్ టెర్రర్ బేస్‌గా వాడుతోంది: పాక్

భారత్-అఫ్గాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ DG అహ్మద్ షరీఫ్ ఇండియాపై దారుణమైన ఆరోపణలు చేశారు. ‘పాక్‌లో టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం అఫ్గాన్‌ను భారత్ ఒక ఉగ్రవాద స్థావరంగా వాడుకుంటోంది. అఫ్గాన్‌లో ఇతరులకు చోటివ్వడం కేవలం పాక్‌కే కాదు.. సౌదీ, UAE, చైనా, US, తుర్కియే దేశాలకూ ప్రమాదమే’ అని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ‘ది డాన్’ నివేదికలో పేర్కొంది.
News October 11, 2025
చైనాకు ట్రంప్ మరోసారి హెచ్చరికలు

అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో చైనాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి ప్రతిచర్యగా చైనా ఉత్పత్తులపై మరోసారి భారీగా సుంకాలు తప్పవని హెచ్చరించారు. చైనాతో స్నేహంగా ఉంటున్నా తాజా చర్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ తరుణంలో జిన్‌పింగ్‌తో భేటీకి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మరో 2 వారాల్లో సౌత్ కొరియా పర్యటన సందర్భంగా జిన్ పింగ్‌తో ట్రంప్ భేటీ కావాల్సి ఉంది.
News October 11, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 11, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.19 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.